భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్
భువనగిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేరును అధిష్టానం ప్రకటించింది.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేరును అధిష్టానం ప్రకటించింది. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు తొలి విడత జాబితాలో భాగంగా శనివారం ఆయన పేరును ప్రకటించారు. బూర నర్సయ్య గౌడ్ టీఆర్‌ఎస్‌లో 2013 జూన్ 2న చేరి, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ సభ్యుడిగా ఉన్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. బూర నర్సయ్య గౌడ్ 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన 2022 అక్టోబర్ 19న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, బండి సంజయ్, కే. లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు.