Tungaturthi : పాఠశాలకు రాని పంతుల్లు…విద్యార్థులకు అంగన్వాడీ టీచర్లే దిక్కు

విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం ఉద్యోగుల కర్తవ్యం. అందులోనూ పంతుల్ల ఉద్యోగం అంటే మరీ విశేషం.

Update: 2024-07-25 13:30 GMT

దిశ,తుంగతుర్తి: విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం ఉద్యోగుల కర్తవ్యం. అందులోనూ పంతుల్ల ఉద్యోగం అంటే మరీ విశేషం. ఎందుకంటే అందరికీ విద్యాబుద్ధులు నేర్పుతూ సన్మార్గంలో నడిపిస్తుంటారు కనుక. కానీ దీనికి భిన్నంగా విధుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతూ చివరికి గైరాహారవుతున్న ఉపాధ్యాయుల తీరును పలువురు చీత్కరిస్తున్నారు. చివరికి పాఠశాలకు అంగన్వాడీ టీచర్ దిక్కు మొక్కుగా మారింది.ఈ పరిస్థితుల్లో గ్రామస్తులు విద్యాశాఖ అధికారిని కలిసి మొరపెట్టుకుంటున్నారు.తమ పాఠశాల సంగతి అంతా చెప్పుకుంటూ ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతున్నారు.

ఈ విచిత్ర సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి కాంప్లెక్స్ పరిధిలోని బండరామారం,జేత్య తండా ప్రాథమిక పాఠశాలల్లో నెలకొంది. బండరామారం గ్రామ ప్రాథమిక పాఠశాలకు చెందిన టి.వెంకట్ రాములు,జేత్య తండాకు పి.సత్యమూర్తి ఇద్దరు ఉపాధ్యాయులు తరచుగా విధులకు గైరాజరవుతున్నారు.విశేషమేమిటంటే....ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభం నాటి నుండి అతి కొద్ది రోజులు మాత్రమే విధులకు హాజరయ్యారు. దీంతో బోధన లేక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ఎంఈఓ తన కార్యాలయంలో పనిచేస్తున్న సిఆర్పిలను గత కొద్ది రోజులుగా పంపుతున్నారు.

కాగా జేత్య తండా పాఠశాల కు ఒక్కోమారు అంగన్వాడి టీచరే దిక్కుమక్కుగా మారారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు సెలవు తీసుకోవాలంటే ప్రధానోపాధ్యాయుడు అనుమతి తప్పనిసరి.ఆ తర్వాత ఎక్కువ రోజులు సెలవులు కావాలంటే ఎంఈఓ అనుమతి తప్పనిసరి. కానీ ఈ ఇరువురు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుడుతో పాటు మండల విద్యాశాఖ అధికారి అనుమతి లేకుండా ఎలాంటి సెలవు, వినతులు లేకుండా దర్జాగా విధులకు గైరాజరావుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై తుంగతుర్తి ఎంఈఓ బోయిని లింగయ్య ను గురువారం వివరణ కోరగా విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. గైర్హాజరు విషయంపై వారికి సంజాయిషీ నోటీసులు పంపినప్పటికీ స్పందన లేదని తెలిపారు. ఈ మేరకు తప్పని పరిస్థితుల్లో వారి వేతనాలను నిలిపినట్లు తెలిపారు. విధులకు హాజరుకాని విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారికి తెలిపినట్లు ఆయన వివరించారు.


Similar News