అందుబాటులో లేని వ్యవసాయ అధికారులు
రాజపేట మండల వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దిశ,రాజపేట: రాజపేట మండల వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం 12 గంటల వరకు కూడా రైతు వేదికలోని వ్యవసాయ శాఖ కార్యాలయం తాళం వేసి ఉండడంతో..వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. గత గురువారం, శుక్రవారం కూడా వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో లేరని చల్లూరు గ్రామానికి చెందిన బాలయ్య, కొండేరు చెరువు గ్రామం చెందిన సుశీలలు తెలిపారు. మూడు రోజులుగా తమ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరూ లేకపోవడంతో..తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు.