రన్నింగ్ రైలులోనే ప్రసవించిన మహిళ

భువనగిరి రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఓ మహిళ ప్రసవించి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Update: 2024-08-06 06:20 GMT
రన్నింగ్ రైలులోనే ప్రసవించిన మహిళ
  • whatsapp icon

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఓ మహిళ ప్రసవించి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్ పుర నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న రైలులో బీహార్‌కి చెందిన హీనా కాతూన్ కి పురిటినొప్పులు వచ్చాయి. భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ఆ మహిళకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.‌ దీంతో రైలులోనే మహిళ ప్రసవించి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది 108కి సమాచారం అందించారు. వెంటనే తల్లి బిడ్డలను భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి తరలించారు.


Similar News