Fire Accident : కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలోని ఓ కాటన్ మిల్లు(Cotton Mill)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది.
దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలోని ఓ కాటన్ మిల్లు(Cotton Mill)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఆలేరులోని మల్లిఖార్జున కాటన్ మిల్లులో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా పత్తి కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు వేల క్వింటాళ్ల పత్తి కాలిపోగా.. భారీగా ఎగసిపడుతున్న మంటలకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.