దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ ను నిర్మించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Update: 2024-07-06 09:53 GMT

 దిశ,చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. శనివారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో టిఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండవీటి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని సమాఖ్య ప్రతినిధులు కలిసి ఇండస్ట్రియల్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం హైదరాబాదులోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కూడా ఆయన నివాసంలో కలిశారు.

హైదరాబాద్ కు తూర్పు వైపున ఉన్న యాదాద్రి భువనగిరి, సూర్యాపేట,నల్గొండ జిల్లాల పరిధిలో నూతన పారిశ్రామిక వాడలు ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. అందుకు నూతన ప్రభుత్వంతో కలిసి కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటుకు సహకారం అందిస్తామని సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దండు మల్కాపురం వద్ద ఇప్పటికే ఏర్పాటైన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద తీవ్ర రద్దీ ఏర్పడుతుందని సమీపంలోని ఆందోల్ మైసమ్మ గుడి వద్ద కూడా ఏర్పడే భక్తుల రద్దీ దృష్ట్యా ఫ్లైఓవర్ ను నిర్మించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

1855 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పారిశ్రామిక ప్రాంతం విస్తరించనుందని, ఇప్పటికే 552 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అయి ఉందని ఫుడ్ పార్క్, భారత్ పెట్రోలియం బాటిలింగ్ ప్లాంట్, టాయ్స్ పార్క్, ప్లగ్ అండ్ ప్లే పార్కులు అభివృద్ధి పనులను ప్రారంభించాయని తెలిపారు. ఇప్పటికే 6675 కోట్ల పెట్టుబడులతో 1500 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని 45,000 మందికి ప్రత్యక్షంగా 35,000 మందికి పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని టిప్ ప్రతినిధులు మంత్రికి, ఎమ్మెల్యేకు వివరించారు.

ఈ సమావేశంలో టిఫ్ సీనియర్ జాయింట్ సెక్రెటరీ గోపాల్ రావు, చౌటుప్పల్ మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, నాదర్గుల్ పారిశ్రామిక ప్రాంత అధ్యక్షులు జలంధర్ రెడ్డి,గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అధ్యక్షులు స్వామి గౌడ్,జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంత ఐల వైస్ చైర్మన్ ఏ ఎల్ ఎన్ రెడ్డి,మౌలాలి పారిశ్రామిక ప్రాంతం ఐలా చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతాల సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి,ఐరన్ అండ్ స్టీల్ ఫర్నిచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ అమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News