BRS ఖమ్మం సభపై MP Uttam Kumar Reddy అనూహ్య వ్యాఖ్యలు

కర్నూలు జిల్లా నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

Update: 2023-01-20 05:48 GMT
BRS ఖమ్మం సభపై MP Uttam Kumar Reddy అనూహ్య వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు జనాలు స్వచ్ఛందంగా రాలేదని కొట్టిపారేశారు. కేసీఆర్ పెద్ద పెద్ద కోరికలతో జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నాడని, అవన్నీ అడియాశలు అవడం ఖాయమని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడం వాళ్లకే తీవ్ర నష్టమని అన్నారు. ఏపీలో బీఆర్ఎస్‌ ప్రభావం ఉండబోదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనూ కేసీఆర్ అనూహ్య ఫలితం చూడబోతున్నాడని జోస్యం చెప్పారు.

Also Read.

Megastar Chiranjeevi కాంగ్రెస్‌లోనే ఉన్నాడు.. AP పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News