ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి.. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఇదే మస్ట్: ‘బలగం’ వేణు

క్రియేటివ్ ఫీల్డ్‌లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందేనని జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (బలగం) ఆచార్య వేణు అన్నారు.

Update: 2023-04-20 15:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: క్రియేటివ్ ఫీల్డ్‌లో ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందేనని జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ (బలగం) ఆచార్య వేణు అన్నారు. ఇండో ఫ్రెంచ్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ (బలగం సినిమా) ఇటీవల అవార్డు వచ్చింది. షాంఘయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టిఫల్‌లో కూడా బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జేఎన్ఏఎఫ్ఏయూలోని సెమినార్ హాల్లో ఆచార్య వేణును యూనివర్సిటీ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆచార్య వేణు మాట్లాడుతూ.. సినిమా రంగంలో అవకాశాలనేవి అంత ఈజీగా రావని విద్యార్థులకు, జూనియర్స్‌కు సూచించారు.


ఈ క్రియేటివ్ ఫీల్డ్‌లో బాధలు, కష్టాలు అందరికీ ఉంటాయని, వాటిని అధిగమించి క్రియేటివ్ ఫీల్డ్‌లో ఎంత యాక్టీవ్‌గా వర్క్ చేస్తే.. అంత మంచి సక్సెస్ ఉంటుందని జూనియర్స్‌కు వివరించారు. సినిమాటిక్‌గా పనిచేయాలన్నారు. ఒకప్పుడు ఒక ఫొటో తీయాలన్నా కూడా ఎంతో శ్రమించాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీతో కంపోజింగ్ వర్క్ కొంత తగ్గిందని అభిప్రాయపడ్డారు. క్రియేటివ్ ఫీల్డ్‌లో అవకాశాలు తనంతట తాను వెతుక్కుంటూ రావని, వర్క్‌ డెడికేషన్ ఉంటే.. అవకాశాలు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఓడీ ఏఆర్ కమల్ రాయ్, ప్రిన్సిపాల్ టి.గంగాధర్, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News