ఊపందుకున్న 'మునుగోడు' ప్రచారం.. ఓటర్లతో భేటీలు-ప్యాకేజీలు..!

ఓటర్లతో భేటీలు.. ప్యాకేజీలు ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికిపోయి మరీ సమావేశం అవుతున్నారు. అక్కడే ఓటర్లకు ప్రయాణ ఖర్చు

Update: 2022-10-24 04:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటర్లతో భేటీలు.. ప్యాకేజీలు ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికిపోయి మరీ సమావేశం అవుతున్నారు. అక్కడే ఓటర్లకు ప్రయాణ ఖర్చులతో పాటు ఓటువేసేందుకు కొంతనగదు ఇస్తున్నారు. వారి ఓట్లు చేజారకుండా ప్రతి నిత్యం వారితో ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారు. అంతేకాదు పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చేలా కోఆర్డినేషన్ చేస్తున్నారు.

మునుగోడు ఓటర్లకు అన్ని పార్టీలు గాలం వేస్తున్నాయి. నియోజకవర్గంలో 2 లక్షల 41 వేలు ఉండగా, కొంత మంది ఉపాధి, ఉద్యోగం, చదువుకోసం వివిధ ప్రాంతాలకు వెళ్లారు. వారందరి వివరాలను ఇప్పటికే సేకరించిన పార్టీలు వారితో పలు ప్రాంతాల్లో భేటీ అయ్యారు. ముంబాయి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రాంతాలకు వెళ్లినవారికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారు. వారు ఓటువేసేందుకు వాహనం కూడా సమకూర్చడం, టిఫిన్, లంచ్ కోసం ఏర్పాట్లతో పాటు ఓటుకు 20వేలకు పైగా ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అందులో కొంతనగదును అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలిసింది. తీసుకురావడమే కాదు తిరిగి మళ్లీ వారు ఉండే ప్రదేశానికి రిటన్ చార్జీలు సైతం ఇస్తామని ఇప్పటికే ఒప్పందం కూడా కుదర్చుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు ఇన్ చార్జులను నియమించిన విషయం తెలిసిందే. వారు ఈ యూనిట్ పరిధిలో ఎంతమంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారనే వివరాలను సేకరించి ఓటర్లవారిగా సంప్రదింపులు చేశారు. ఇప్పటికే ప్యాకేజీ సైతం ఇచ్చామని అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేనే తెలిపారు.

ఓటర్ ఐడీకార్డుల సేకరణ

యూనిట్ల ఇన్‌చార్జులుగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఆ యూనిట్ పరిధిలోని కొంతమంది ఓటర్ల ఐడీకార్డులను సైతం సేకరించినట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి ఐడీ కార్డులను సైతం సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ కార్డుల ఆధారంగానే ప్యాకేజీలు ఇస్తున్నట్లు సమచారం. అన్ని పార్టీలదీ అదే తీరు. ఓటుహక్కులేని వారిని మాత్రం నేతలు కనీసం మందలించడం లేదంట. ఓటర్లు ఓటర్ కార్డులను మరోపార్టీకి ఇస్తే తాము పెట్టిన ఖర్చు వృథా అవుతుందని భావించి ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఓటర్ కార్డులు తీసుకుంటున్నారు. ఇలా అయితే పక్కా తమకే పడతాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరీ పోలింగ్ బూత్ లోకి వెళ్లిన తర్వాత మాత్రం డిసైడ్ చేసేది మాత్రం ఓటరే అనే లాజిక్ ను మాత్రం విస్మరిస్తున్నారు.

ప్రతిరోజూ వారితో టచ్‌లో...

ఇతర ప్రాంతాల్లో టచ్‌లో ఉంటున్న ఓటర్లతో అన్ని పార్టీల నేతలు, పార్టీల ఇన్ చార్జులు టచ్‌లో ఉంటున్నారు. నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధానపార్టీలదంతా ఇదే తీరు. ఇందుకోసం 10 మందికి ఒకరికి కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. వారికి ప్యాకేజీ అయినా.. చార్జీలు అయినా ఇవ్వాల్సింది వారే. ఓట్లు వేయకుంటే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చే బాధ్యత కూడా కోఆర్డినేటర్‌దే. అందుకోసం అన్ని పార్టీలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ యూనిట్ పరిధిలో అయితే నిత్యం నేతలు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను నేరుగా కలుస్తుండగా, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారితో మాత్రం ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారు. ఇందుకోసం కూడా ఒకరిని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : ఓట్లు లక్ష ఓటరుకు రూ.లక్ష..? అసలు టార్గెట్ అదే..​

Tags:    

Similar News