అడవి నుంచి అమెరికా వరకు అంటూ ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్ (వీడియో)

అమెరికాలో జరగుతోన్న తానా సభల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

Update: 2023-07-08 11:56 GMT
అడవి నుంచి అమెరికా వరకు అంటూ ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్ (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో జరగుతోన్న తానా సభల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నిర్వాహకులు, హీరో బాలకృష్ణ ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీతక్క ఎమోషనల్ అయ్యారు. అడవి నుంచి అమెరికా వరకు అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన తానా జాతీయ సదస్సుకు, తనను ఎంతో ప్రేమతో స్వాగతం పలికిన ప్రతిఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

కాగా నక్సల్ ఉద్యమానికి ఆకర్షితురాలైన సీతక్క కొన్నేళ్లపాటు నక్సల్ ఉద్యమంలో కొనసాగారు. అనంతరం జనజీవన స్రవంతిలో కలిసి 2009లో ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014లో ఓటమి పాలైన ఆమె అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలోనే 2018లో ములుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున  సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

Tags:    

Similar News