‘KTR వ్యాఖ్యలకు కన్నీళ్లు వస్తున్నాయి’.. లైవ్‌లోనే బోరున ఏడ్చిన MP కేకే (వీడియో)

కేకేకు ఆయన కుటుంబ సభ్యులకు పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే స్పందించారు.

Update: 2024-04-13 14:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేకేకు ఆయన కుటుంబ సభ్యులకు పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. బీఆర్ఎస్‌లో ఉన్నన్ని రోజులు నాకు ఓరిగింది ఏమి లేదని.. బీఆర్ఎస్ పార్టీ కారణంగా నా కుటుంబ చీలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత తన కొడుకు పెట్టిన మేసేజ్ చూపించి లైవ్‌లోనే కేకే కన్నీళ్లు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఉండగా సీనియర్ అనే గుర్తింపు అయిన ఉండేదని.. బీఆర్ఎస్‌లో సీనియర్ అనేగానీ అసలు గుర్తింపు లేదని షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారని చెప్పారు. తన కుమారుడు విప్లవ్‌కు ఎమ్మెల్సీ అడిగితే కూడా ఇవ్వలేదన్నారు. కాగా, ఇటీవల కేకే, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన కేకే కూతురితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 


Similar News