
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Eetala Rajendar) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని.. దమ్ముంటే హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అబిడ్స్, ఎల్బీనగర్.. ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన వినాశనం వలన కేసీఆర్(KCR) పతనానికి 9 ఏళ్లు పడితే, రేవంత్ పతనానికి 9 నెలలే పట్టిందని తెలిపారు.
ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించారని గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజానికి ప్రజలు కేసీఆర్‌ను ఓడించారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్(BRS)కు మరో అవకాశం వచ్చే పరిస్థితి లేదని, కాంగ్రెస్‌కు అసలు దేశంలోనే చోటు లేదని వెల్లడించారు. తదుపరి ఎలెక్షన్స్ లో బీజేపీ(BJP) అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.