ఎంపీగా నాలుగేళ్లు పూర్తి.. వీడియో రిలీజ్ చేసిన ధర్వపురి అర్వింద్

ఎంపీగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ అయ్యారు.

Update: 2023-07-02 11:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎంపీగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమోషనల్ అయ్యారు. ఎంపీగా అవకాశం ఇచ్చిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని ట్విట్టర్ వేదికగా చెప్పారు. ‘‘అభివృద్ధిలో మోదిత్వం.. ప్రజలతోనే అనునిత్యం.. నిర్లక్ష్యం జాడలేదు.. అవినీతికి తావులేదు’’ అంటూ అర్వింద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నాలుగేండ్ల కాలంలో రెండేండ్లు కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బందిపడ్డారని అన్నారు. తనను ఎన్నుకున్న ప్రజల కోసం ప్రతి క్షణాన్ని వినియోగించానని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా తన పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రతి అర్హుడికి చేరేలా చేశానని చెప్పారు. ఈ నాలుగేళ్ల రాజకీయ ప్రయాణం సంతృప్తితో పాటు ప్రజలకు ఇంకా సేవ చేయాలనే సంకల్పాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తన నాలుగేళ్ల ఎంపీ ప్రయాణంపై ఎంపీ అర్వింద్ డాక్యుమెంటరీని విడుదల చేశారు. తాను ఎంపీ అయ్యాక చేసిన పలు అభివృద్ధి పనుల గురించి వీడియోలో తెలిపారు ఎంపీ అర్వింద్.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..