తెలంగాణ ప్రభుత్వానికి MP అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు

తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు చెప్పారు.

Update: 2024-08-04 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్ఐఎమ్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌లో రాత్రి ఒంటిగంట వరకు వ్యాపారాలు చేసుకోవచ్చని ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చాలా మంది వ్యాపారులకు భారీ ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. మజ్లిస్ పెట్టిన రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్.. స్వయంగా అసెంబ్లీ వేదికగా స్పందించి.. సమస్యను తక్షణమే పరిష్కరించడం శుభపరిణామం అని అభిప్రాయపడ్డారు.

కాగా, అర్ధరాత్రి ఒంటిగంట వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. పోలీసులు గత కొన్ని నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయిస్తున్నారు. రాత్రి 11 దాటిన తర్వాత ఆహారం కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది నుంచి ఫిర్యాదులు రావటంతో మద్యం దుకాణాలు మినహా ఇతర ఏ వ్యాపారమైనా రాత్రి ఒకటి వరకు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల విషయంలో మినహాయింపులు ఉండబోవని సభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..