దేశంలో ఆ పని చేసే సత్తా ఓన్లీ కేసీఆర్‌కే ఉంది: MP అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సమావేశాలు నిర్వహించిన ఇండియా కూటమీ ముంబైలో మూడో భేటీకి సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ మరోసారి తెరమీదకు వచ్చింది. థర్డ్ ఫ్రంట్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కోసం కృషి చేయాలని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో థర్డ్ ఫ్రంట్ రావాలని, అందుకోసం సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సత్తా కేసీఆర్‌కే సాధ్యమన్నారు. ఆయనతో కలిసేందుకు దేశంలో అనేక పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ విషయంపై కేసీఆర్‌కు అనేక సార్లు తాను విన్నవించినట్లు చెప్పుకొచ్చారు.