నేను లేని సమయంలో గొడవలు జరిగాయి.. మా నాన్న చేసిన తప్పు అదే: Vishnu Manchu

మంచు ఫ్యామిలి లో వివాదం, జర్నలిస్టుపై దాడి(, attack on journalist) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.

Update: 2024-12-11 07:32 GMT

దిశ, వెబ్ డెస్క్: మంచు ఫ్యామిలి లో వివాదం, జర్నలిస్టుపై దాడి(, attack on journalist) ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. కాగా ఈ దాడిపై మంచు మనోజ్(Manoj) ఇప్పటికే స్పందిస్తూ.. తన తరఫున మీడియాకు క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా మంచు మోహన్ బాబుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి మోహన్ బాబు(mohanbabu) ఆస్పత్రిలో చేరగా.. బీపీ, హైటెన్షన్, హార్ట్ బీట్ తక్కువగా ఉండటం.. కన్ను కింద వాపు కారణంగా చికిత్స పొందుతున్నారని ఆయన స్థిమితంగా ఉండలేక పోతున్నాడని, అతని చుట్టూ ఎమ్ జరుగుతుందో ఆలోచించలేక పోతున్నాడని డాక్టర్లు తెలిపారు. అనంతరం అక్కడే మంచు విష్ణు(Manchu vishnu) మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి మోహన్ బాబు ఉద్దేశ పూర్వకంగా రిపోర్టర్ పై దాడి చేయలేదని.

ఓవర్ హీట్ కారణంగా హటాత్తుగా జరిగిన పరిణామం అని చెప్పుకొచ్చారు. అలాగే రిపోర్టర్ రంజిత్ కుటుంబ సభ్యులతో తాను మాట్లాడానని.. రిపోర్టర్ రంజిత్‌కు తాను భరోసాగా ఉంటానని చెప్పుకొచ్చారు. అనంతరం ఫ్యామిలీ వివాదంపై స్పందిస్తూ.. తాను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అమెరికాలో ఉన్నానని.. తాను ఇంట్లో లేని ఐదు రోజుల్లోనే ఈ గొడవలు జరిగాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇలా జరగడం బాధగా ఉందని గొడవలు పరిష్కరించేందుకు మా పెద్దలు ప్రయత్నిస్తున్నారని, మీడియా దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి చూపించవద్దని అందరి ఇండ్లలో ఇలాంటి గొడవలు సహజమే అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మా నాన్న మాపై అతి ప్రేమను పెంచుకున్నారని అదే ఆయన చేసిన తప్పని ఈ సందర్భంగా విష్ణు చెప్పాడు.

Tags:    

Similar News