MLG: న్యూఇయర్ వేళ విషాదం.. సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు
నూతన సంవత్సరం(New Year) వేళ మిర్యాలగూడ(Miryalaguda)లో విషాదం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సరం(New Year) వేళ మిర్యాలగూడ(Miryalaguda)లో విషాదం చోటు చేసుకుంది. సాగర్ ఎడమ కాలువ(Sagar left canal)లో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ఘటన ప్రకారం మిర్యాలగూడ మండలం ఐలాపురం వద్ద సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని, గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతు అయిన వారు యాదాద్రి పవర్ ప్లాంట్ కు చెందిన ఉద్యోగులు కార్తీక్ మిశ్రా, విజయ్ గోస్వామి అని, పవర్ ప్లాంట్‌లో ఇంజినీర్లుగా పని చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.