MLC Kavita: గురుకుల విద్యార్థినికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై నిమ్స్ హాస్పిటల్‌(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థిని శైలజ, కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కవిత(MLC Kavita)పరామర్శించారు.

Update: 2024-11-23 10:01 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై నిమ్స్ హాస్పిటల్‌(NIMS Hospital)లో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థిని శైలజ, కుటుంబసభ్యులను ఎమ్మెల్సీ కవిత(MLC Kavita)పరామర్శించారు. కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలోని వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ కారణంగా శైలజ అస్వస్థతకు గురైంది. విద్యార్థిని శైలజను పరామర్శించిన అనంతరం కవిత మీడియాలో మాట్లాడారు. చికిత్స పొందుతున్న శైలజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు. గురుకులాల పాఠశాలల పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తే పసిపిల్లల ప్రాణాలు కాపాడిన వారవుతారన్నారు. అదిలాబాద్ టూ అలంపూర్ వరకు గురుకులాలన్ని కూడా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. సీఎం సమీక్ష చేసిన మరుసటి రోజునే నారాయణ పూర్ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తీరు పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ పాలనలో గురుకుల పాఠశాలల విద్యార్థులు గొప్పగా చదువుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 11నెలల్లోనే 42మంది చనిపోవడం బాధకరమన్నారు. ప్రభుత్వం వెంటనే గురుకుల పాఠశాలల్లో వసతులు మెరుగుపరుచాలన్నారు. సీఎం రేవంత్ గురుకులాల సమస్యలపై స్పందించాలని, చనిపోయిన విద్యార్థులకు 10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు.

అంతకుముందే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ (Koppula Eshwar) కూడా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలని మండిపడ్డారు. హాస్టళ్లలో పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 

Tags:    

Similar News