Kavitha: జైలు జీవితంపై MLC కవిత సంచలన వ్యాఖ్యలు
సెన్సేషన్ కావడానికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కామెంట్స్ చేస్తున్నారని బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: సెన్సేషన్ కావడానికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కామెంట్స్ చేస్తున్నారని బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha) విమర్శించారు. శుక్రవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రజల కనీస అవసరాలు చూడటం ముఖ్యమంత్రి కనీస బాధ్యత అని అన్నారు. లగచర్ల భూ సేకరణ రద్దు చేయడం బీఆర్ఎస్ నిర్ణయం అని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో అమ్మాయిలు చనిపోతుంటే ప్రభుత్వం విఫలం అయినట్లు కాదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో నా జైలు జీవితం చిన్న పాస్ మాత్రమే.. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా అని కవిత కీలక ప్రకటన చేశారు. అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేశారు.