అమ్మకాల కోసమే ప్రత్యేకంగా ఓ మినిస్ట్రీ: కేంద్ర ప్రభుత్వం MLC కవిత ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి సంస్థను కాపాడుకుంటామని ఆమె అన్నారు.

Update: 2023-01-22 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తున్నారని.. కానీ తెలంగాణలో మాత్రం సింగరేణి సంస్థను కాపాడుకుంటామని ఆమె అన్నారు. సింగరేణి అంటే కేవలం బొగ్గు తీయడమే కాదని.. విద్యుతుత్పత్తి కూడా మనమే చేయవచ్చిన నిరూపిస్తు్న్న ఘనత తెలంగాణది అని కొనియాడారు. విల్ పవర్.. దక్షత ఉన్న నేత సీఎం కేసీఆర్ అని పొగిడారు. బీజేపీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కేంద్రంలో అమ్మకాల కోసమే ప్రత్యేకంగా ఓ మినిస్ట్రీ పెట్టారని ఎద్దేవా చేశారు. కేంద్ర దీపం పథకం పేరుతో నిరుద్యోగుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని అన్నారు.

Tags:    

Similar News