MLC COUNTING : తీన్మార్ మల్లన్న గెలుపునకు ఇంకా ఎన్ని ఓట్లు కావాలంటే..?

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది.

Update: 2024-06-07 02:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మూడో రోజు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో కంటే అత్యధికంగా 25,824 చెల్లని ఓట్లు నమోదు అయ్యాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలుపు కోటా ఓట్లు 1,55,095 గా నిర్ణయించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32,282 కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపునకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50,847గా తేల్చారు.


Similar News