గన్‌పార్క్ వద్ద ఎదురుపడిన రెండు పార్టీల నేతలు (వీడియో)

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.

Update: 2023-12-09 06:16 GMT
గన్‌పార్క్ వద్ద ఎదురుపడిన రెండు పార్టీల నేతలు (వీడియో)
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద మంత్రులు, నాయకులు, పొలీసులు, మీడియా వారితో సందడి వాతావరణం ఏర్పడింది. అయితే తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి బయలుదేరారు. మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యేలు ర్యాలీగా అసెంబ్లీలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే గన్‌పార్క్ వద్ద బీజేపీ నేతలు వారికి ఎదురుపడ్డారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అమరవీరులకు నివాళులు అర్పించారు.

Read More:    బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా కేసీఆర్ 

Tags:    

Similar News