GHMC: కార్పొరేటర్లతో కలిసి MLA రాజాసింగ్ ఆందోళన

బీజేపీ కార్పొరేటర్లతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఎదుట గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బైఠాయించారు.

Update: 2024-08-08 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ కార్పొరేటర్లతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఎదుట గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బైఠాయించారు. గ్రేటర్‌లో స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. అంతేకాదు.. ప్రాపర్టీ ట్యాక్స్ బహిష్కరిస్తామని హెచ్చరికలు చేశారు. ఎమ్ఐఎమ్ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన అనంతరం కార్పొరేటర్లతో కలిసి మున్సిపల్ కమిషనర్‌కు ఆమ్రపాలికి ఎమ్మెల్యే రాజాసింగ్ వినతిపత్రం సమర్పించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..