MLA Rajaiah : రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు

కడియం శ్రీహరిపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది.

Update: 2023-07-11 06:39 GMT
MLA Rajaiah : రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కడియం శ్రీహరిపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. ప్రగతిభవన్‌కు వచ్చి కలవాలని మంత్రి కేటీఆర్ రాజయ్యకు సూచించారు. వరుస వివాదాలు, తీవ్ర వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజయ్యను వివరణ కోరే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. కాగా రాజయ్య వర్సెస్ కడియం మధ్య వార్ రోజురోజుకూ ముదురుతోంది. ఈ రోజు ఉదయం సైతం ఎమ్యెల్యే రాజయ్య ఎమ్మెల్సీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ల కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశాడని ఆరోపించారు. కడియం ఎస్సీ కాదు.. బీసీ అని హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలతో అలర్ట్ అయిన ప్రగతి భవన్ రాజయ్యకు కబురు పంపింది.

Read more: Rajaiah Vs Kadiam Srihari: కడియంపై మరోసారి MLA రాజయ్య సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News