ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: Telangana Congress సంచలన నిర్ణయం

ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

Update: 2022-12-29 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చెల్లదంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే హైకోర్టు అనూహ్య ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే అదునుగా భావించిన తెలంగాణ కాంగ్రెస్ సీఎం కేసీఆర్‌కు మరో షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల వ్యహారంపైనా విచారణ చేయాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, ఓవైపు బీజేపీ నేతల ఆరోపణలు, దర్యాప్తు సంస్థల విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్‌ఎస్‌కు టీకాంగ్రెస్‌ మరో ఊహించని షాక్ ఇవ్వడంతో కేసీఆర్ తదుపరి స్టెప్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read... 

BL సంతోష్ HYD పర్యటనపై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్! 

Tags:    

Similar News