ఈయన్ను అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే ఎవరైనా నమ్ముతారా?
ఎమ్మెల్యే అంటే.. ముందు పోలీసు జీపు.. వెనకాల అనుచరుల వాహనాలతో ఆ హడావుడి మామూలుగా ఉండదు. కానీ, అశ్వరావుపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం సాదాసీదాగా గడిపేస్తున్నారు.
దిశ, అశ్వారావుపేట: ఎమ్మెల్యే అంటే.. ముందు పోలీసు జీపు.. వెనకాల అనుచరుల వాహనాలతో ఆ హడావుడి మామూలుగా ఉండదు. కానీ, అశ్వరావుపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం సాదాసీదాగా గడిపేస్తున్నారు. సాధారణ వ్యక్తిలా ఓ లుంగీ కట్టుకొని, గ్లామర్ బైకుపై శనివారం దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో పర్యటించారు. చిన్నపాటి నాయకులే వేషధారణలో ఎంతో హడావుడి చేస్తున్న రోజుల్లో.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మెచ్చా స్వతహాగా రైతు కావడంతో ఈ విధంగా బయట కనిపించడానికి ఇష్టపడుతారని సమాచారం. దీంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..