పెద్దాయన మాట్లాడితే చూస్తా: మైనంపల్లి హనుమంతరావు
రెండు అసెంబ్లీ టికెట్ ఇవ్వనందుకు పార్టీ మారే ఆలోచనలో ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును బుజ్జగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు అసెంబ్లీ టికెట్ ఇవ్వనందుకు పార్టీ మారే ఆలోచనలో ఉన్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును బుజ్జగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీలోని ఓ కీలక నేత ఆయనకు ఫోన్ చేసి నచ్చజెప్తున్నట్టు సమాచారం. అయితే పార్టీలో కొనసాగాలంటే సీఎం కేసీఆరే తనతో మాట్లాడాలని మైనంపల్లి షరతు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో మధ్యవర్తిత్వం వహిస్తోన్న సదరు లీడరు విషయాన్ని ప్రగతిభవన్‌కు చేరవేసిట్టు తెలిసింది.
కేటీఆర్‌తో కాదు కేసీఆర్‌తోనే..
సోనియా గాంధీ సభా వేదికపై బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కొందరు లీడర్లు కాంగ్రెస్ లో చేరుతారని, ఆ సందర్భంలో మైనంపల్లి కండువా కప్పుకుంటారనే ప్రచారం ఉంది. అయితే మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తే పార్టీకి నష్టమని అంచనాకు వచ్చిన బీఆర్ఎస్ పెద్దలు ఆయనను బుజ్జగించే బాధ్యతలను ఓ కీలక నేతకు అప్పగించారు. ఆ నేత కొన్ని రోజులుగా మైనంపల్లి కి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం సదరు నేత మైనంపల్లి కి ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ మాట్లాడుతారని సంకేతాలు ఇచ్చిన ట్టు సమాచారం.
అయితే మైనంపల్లి మాత్రం సీఎం కేసీఆర్‌తో మాత్రమే తను మాట్లాడుతానని, ఒకవేళ ఆయన హామీ ఇస్తే ఏం చేయాలో ఆలోచిస్తా అని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మైనంపల్లి డి మాండ్‌ను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో హన్మంతరావు కాంగ్రెస్‌లోకి వెళ్ల కుండా చివరి వరకు ప్రయత్నించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, అందుకే ఆయన ఎన్ని విమర్శలు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చర్చ పార్టీలో ఉంది.