Saichand : సాయిచంద్ భౌతికకాయాన్నిచూసి బోరున విలపించిన మంత్రులు
గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
దిశ, వెబ్ డెస్క్: గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన స్వగ్రామానికి వెళ్లి సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు బోరున విలపించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాయిచంద్ తనను ప్రేమగా అన్న పిలిచేవాడని, ఇటీవల తన ఇంటికి పిలిచి తనకు భోజనం పెట్టాడని గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ లేనిదే బీఆర్ఎస్ ఏ సభ జరిగేది కాదని అన్నారు.
ఈ క్రమంలోనే సాయిచంద్ కు భవిష్యత్తులో మంచి పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ తనతో చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంత చిన్న వయసులో సాయిచంద్ అందరిని వదిలి వెళ్లడం బాధాకరమని అన్నారు. ఇక మంత్రి సబిత మాట్లాడుతూ.. కొద్దికాలంలోనే సాయిచంద్ తో అనుబంధం ఏర్పడిందని, సొంత తమ్ముడు కోల్పోయాయని కన్నీరుపెట్టుకున్నారు. సాయిచంద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు.
Read More: Saichand : సాయిచంద్ మృతదేహం వద్ద గుండె పగిలేలా ఏడ్చిన తండ్రి