Uttam Kumar Reddy: రుణమాఫీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో రైతులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో రైతులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. శుకవారం ఆయన మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. రుణమాఫీ(Runa Mafi) విషయంలో రైతులను చాలా మోసం చేసిందని అన్నారు. రేపు.. మాపు అంటూ కాలక్షేపం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇంకా కొందరికి రుణమాఫీ కావాల్సి ఉందని.. దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా ధాన్యం పండిందని అన్నారు. 66.7 లక్షల ఎకరాల్లో పంట పండించారని తెలిపారు. మొత్తంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని స్పష్టం చేశారు. పదేండ్లుగా ఆగిన అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో పరుగులు పెడుతుందని అన్నారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో సమస్యలుంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.