నేడు మంత్రులతో ముఖాముఖి.. హాజరుకానున్న మంత్రి సీతక్క
గాంధీభవన్ (Gandhi Bhavan)లో ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గాంధీభవన్ (Gandhi Bhavan)లో ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రి గాంధీ భవన్ (Gandhi Bhavan)లోనే అందుబాటులో ఉండనున్నారు. సాధారణ ప్రజలతో పాటు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల వారికి సంబంధించి ఎవరికైనా సమస్యలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సీతక్క కోరారు.