Minister Seethakka: ప్రశ్నించడం తెలంగాణ ఆడబిడ్డల రక్తంలోనే ఉంది

= ఉద్యమాలు చేసిన చరిత్ర మా కుటుంబానిది = పోడు భూముల కోసం మా తండ్రి జైలుకు వెళ్లారు

Update: 2024-07-31 10:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎవరేం చేస్తున్నారో ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. ఉద్యమాలు చేసిన చరిత్ర మా కుటుంబంలోనే ఉందని తెలిపారు. పోడు భూముల కోసం మా తండ్రి జైలుకు వెళ్లారని సీతక్క చెప్పారు. ప్రశ్నించడం తెలంగాణ ఆడబిడ్డల రక్తంలోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపుతుందని వెల్లడించారు. గతంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డికి అపారమైన గౌరవం ఉండేదని గుర్తుచేశారు. కానీ, మారిన రాజకీయాలతో సభలో చర్చ జరిగిందని అన్నారు. ఉద్యోగాలపై విపక్షాలు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్నా మీరేందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని సీతక్క బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. ఆశావర్కర్లు, అంగన్వాడీల తల్లిదండ్రుల పింఛన్లను గత బీఆర్ఎస్ సర్కార్ తొలగించిందని అన్నారు.

Tags:    

Similar News