కేసీఆర్ నోరు అదుపులో ఉంచుకోవాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తుక్కుగూడలో కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర బహిరంగ సభలో ఆయన

Update: 2024-04-06 13:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. తుక్కుగూడలో కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలని విమర్శించారు. తుక్కుగూడలో నిర్వహిస్తున్న జనజాతర సభ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జరుగుతోన్న సభ అని అన్నారు. సెప్టెంబర్ 17న ఇదే గ్రౌండ్‌లో సభ నిర్వహించి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించామని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకుండా సిరిసిల్లపోయి కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల పేరుతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్ రాలేదని.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మాటలు అదుపులో ఉంచుకోవాలని హితవు పలికారు. నియంతృత్వ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని.. తెలంగాణలోని అన్ని లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Similar News