ధరణి దరఖాస్తులపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ధరణి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-03-07 12:53 GMT
ధరణి దరఖాస్తులపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ధరణి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం హడావుడిగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం ధరణి సమస్యలకు సంబంధించిన 2,46,536 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచే దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు 76,382 దరఖాస్తుల సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడించారు. రోజుకు 15 వేలకు పైగా దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News