బీజేపీ నాయకులవి పాసి ముఖాలు.. వాళ్లకు లేస్తా లేదు.. Minister Mallareddy హాట్ కామెంట్స్

ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేస్తున్న మంత్రి మల్లారెడ్డి బీజేపీ నాయకులపై సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2023-01-18 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేస్తున్న మంత్రి మల్లారెడ్డి బీజేపీ నాయకులపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని.. ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. 19 రాష్ట్రాల సీఎంలో ఏ ఒక్కరైనా తెలంగాణ మోడల్‌ను చూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నేటి సభతో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందుతుందన్నారు. ఈ సభకు తాము ప్రజలను తరలించడం లేదని వాళ్లే లక్షాలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవతార పురుషుడని.. ఆయన అభివృద్ధి చేయడానికే పుట్టాడని పొగడ్తల్లో ముంచెత్తారు. తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తం చేయడానికే కేసీఆర్ నడుం బిగించాడని.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. అలాగే బీజేపీ నాయకులవి పాసిపోయిన ముఖాలని, వారి ఫేస్ వాల్యూ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారం ఉన్న వారికి లేస్తాలేదని.. అందుకే ఐటీ, ఈడీ దాడులు చేస్తున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ అంటే చరిత్ర అని.. సింగిల్, డబుల్ ఇంజన్ కాదు.. దేశాన్ని తెలంగాణ మోడల్ చేయడమే కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. 

Also Read....

ఎమ్మెల్యే విన‌య్ భాస్కర్ అనుచ‌రుడు వేముల అరెస్ట్ తప్పదా..? 

Tags:    

Similar News