‘రాత్రిళ్లు పోలీసుల ఆధ్వర్యంలో ఆటోలు నడపండి’

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ముందుంటానని సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారు.

Update: 2023-03-10 11:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తాను ముందుంటానని సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారు. తాజాగా ఓ మహిళ ప్రయాణికురాలు చేసిన ట్వీట్​కు ఆయన స్పందించారు. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద రాత్రి సమయాల్లో మెట్రోరైలు, బస్సులు నడవని సమయంలో ఆటోలను ఏర్పాటు చేయాలని ఓ మహిళ కేటీఆర్​కు విజ్ఞప్తి చేసింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మహిళలకు ఆటోలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్​ను ట్వీట్టర్ వేదికంగా కోరింది. ఈ నేపథ్యంలో మహిళ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు.

మహిళలకు రాత్రి సమయంలో పోలీసుల ఆధ్వర్యంలో నడిచే ఆటోలు ఏర్పాటు చేయాలని డీజీపీ అంజనీ కుమార్‌కు సూచించారు. ట్రాకింగ్ మెకానిజంతో ఆటోల ఏర్పాటు చేయాలని.. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని డీజీపీకి కేటీఆర్‌ ఆదేశించారు. కేటీఆర్ సూచనపై డీజీపీ అంజనీకుమార్ సానుకూలంగా స్పందించారు. మహిళలు సురక్షిత ప్రయాణం చేసేలా తగిన రవాణా సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.



Tags:    

Similar News