ఆకలి సూచీలో 107 స్థానంలో భారత్.. కేంద్రంపై కేటీఆర్ సెటైర్
ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరడంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107 స్థానంలో నిలిచింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరడంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్పీఏ గవర్నమెంట్ సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ ఎద్దేవా చేశారు. ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరిందని తెలిపారు. ఈ ఫెయిల్యూర్‌ను బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని తాను అనుకుంటున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Yet another day & yet another amazing achievement of NPA Govt 👏
— KTR (@KTRTRS) October 15, 2022
India slipped from 101st to 107th rank in Global Hunger Index
Instead of accepting failure, am sure BJP jokers will dismiss the report as anti-Indian now #AchheDin https://t.co/vdMR4GUuHN