మునుగోడు యువతకు మంత్రి KTR కీలక విజ్ఞప్తి
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వేళ ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో మునుగోడు ప్రజలకు హామీల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా, మంత్రి కేటీఆర్ మునుగోడు యువతకు కీలక విజ్ఞప్తి చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వేళ ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో మునుగోడు ప్రజలకు విస్తృతంగా హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా, మంత్రి కేటీఆర్ మునుగోడు యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తీ, గ్రామీణ రంగంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పన చేస్తూ, మరోవైపు ప్రైవేటురంగంలో వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాది యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషిచేస్తున్న టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019 లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిందని తెలిపారు. సుమారు 35 వేలమంది స్థానిక యువతకు ఉపాధినందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా శరవేగంగా నిర్మాణం అవుతోందని.. ప్రభుత్వం యువత కోసం చేస్తు్న్న అభివృద్ధి మేరకు టీఆర్ఎస్ సర్కారుకు యువత అండగా నిలబడాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర్‌లో 2019లోనే నెలకొల్పింది టీఅర్ఎస్ ప్రభుత్వం.@TIF_TELANGANA@Koosukuntla_TRS
— KTR (@KTRTRS) October 24, 2022
1/3 pic.twitter.com/lpRyHiLpeY