ప్రజలకు అత్యవసరమైన నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై అధికారులతో చర్చించాం: మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-05 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రజల సమస్యల గురించి అధికారులతో చర్చించానని కోమటిరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ప్రజలకు అత్యవసరమైన నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించడం జరిగిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 వేల కోట్లతో నిర్మిస్తున్న సీఆర్ఐఎఫ్ అండ్ ఇతర ఆర్, బీ రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే సచివాలయ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.


Similar News