నేటి నుంచి కొత్త ఆసరా

రాష్ట్రంలో ప్రతీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వం 'ఆసరా' గా నిలుస్తుందని రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

Update: 2022-09-07 14:30 GMT

దిశ, నిర్మల్ : రాష్ట్రంలో ప్రతీ వర్గానికి తెలంగాణ ప్రభుత్వం 'ఆసరా' గా నిలుస్తుందని రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని సోన్ మండల పరిధిలో నూతనంగా మంజూరైన 580 ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోన్ మండలంలో పాత పింఛన్లు 6,820 ఉండేవని, కొత్తగా మంజూరైన 580 పింఛన్లు మంజూరయ్యాయన్నారు. దీంతో మండలంలో పింఛన్లు తీసుకునే లబ్దిదారుల సంఖ్య 7,400లకు చేరిందన్నారు.

ఈ ఆసరా పింఛన్ వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు బాసటగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అనేక సంక్షేమపథకాలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. 17 కోట్లతో సోన్ నుండి శాంతినగర్ వరకు డబుల్ రోడ్డు నిర్మించామని తెలిపారు. బొప్పారంలో 400 కేవి విద్యుత్ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టి.వినోద్, జెడ్పిటీసీ జీవన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, పీఏసీఎస్ డైరెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఎంపీటీసీ లింగవ్వ శ్రీనివాస్, నాయకులు పాకాల రాంచందర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోయినోద్దీన్, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Also Read : కడియం శ్రీహరిపై MLA రాజయ్య అనూహ్య వ్యాఖ్యలు



Similar News