అలా మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు అని రైతులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకి రాయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే కరెంట్ కష్టాలు అన్న మంత్రి.. కాంగ్రెస్ పాలనలో రైతుల కొడుకులకు పిల్లనిచ్చేవారు కాదని అన్నారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. రాహుల్ గాంధీకి రైతుల కష్టాల గురించి ఏం తెలుసన్న మంత్రి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారని కొనియాడారు.