YSR గొప్ప వ్యక్తి.. ఆయన్ను జన్మలో మర్చిపోను

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-21 11:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జెంటిల్‌మెన్ అని.. ఆయన్ను జన్మలో మర్చిపోలేను అని వ్యాఖ్యానించారు. తమకు నాలుగు శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్ఆర్ పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. తమకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో లేరు అని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై అనేక ఆరోపణలు చేశారని అన్నారు. తాము ఎప్పుడూ ముస్లింల హక్కుల కోసమే పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయబోమని, నిత్యం ప్రభుత్వానికి సహకరించేందుకు రెడీగా ఉన్నామని అన్నారు. అంతేకాదు.. తాము ఏనాటికీ బీజేపీకి బీ-టీమ్ కాబోము అని తేల్చి చెప్పారు. ప్రాణాలైనా వదిలేస్తాము కానీ, బీజేపీతో మాత్రం కలిసి నడవబోము అని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..