గ్రూప్-4 దివ్యాంగ అభ్యర్థుల అలర్ట్.. TGPSC కీలక సూచన
సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు శనివారం ఒక
దిశ, తెలంగాణ బ్యూరో: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రూప్-4 దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య పరీక్షలు ఈనెల 30 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు చేపడుతున్నట్లు చెప్పారు. ఎర్రగడ్డలోని మెంటల్ కేర్ ప్రభుత్వ దవాఖానలో మెడికల్ బోర్డు ఈ వైద్య పరీక్షలు నిర్వహించనుంది. కాగా అభ్యర్థులు తమ హాల్‌టికెట్, ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు పాత మెడికల్ సర్టిఫికెట్ తో పాటు కుటుంబసభ్యుడిని వెంట తీసుకురావాలని సూచించారు. రోజువారీ మెడికల్ బోర్డు షెడ్యూల్ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని స్పష్టంచేశారు.