విద్యార్థులకు సంగీతంపై అవగాహన కల్పించాలి
విద్యార్థులు సంగీతంపై అవగాహన కల్పించుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

దిశ, ఘట్కేసర్ : విద్యార్థులు సంగీతంపై అవగాహన కల్పించుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి సూచనతో స్పిక్ మెక్ కే ఆధ్వర్యంలో శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ లలిత కళల పాఠశాలలో కర్నాటిక్ సంగీత కచేరిని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ముఖ్య అతిథిగా హాజరై భారతీయ సంగీతంపై విద్యార్థులు అవగాహన ఏర్పర్చుకోవాలని సూచించారు. ప్రముఖ గాయని గీతారాజా ఆధ్వర్యంలో జరిగిన కర్ణాటక సంగీత కచేరి కార్యక్రమంలో గురుకుల విద్యాలయ సంస్థ సంయుక్త కార్యదర్శి సక్రునాయక్, రాష్ట్ర స్థాయి అధికారి భీమయ్య , ఓఎస్డి పీఎస్ఆర్ శర్మ, స్పిక్ మెక్ కే కన్సల్టెంట్ వీతారెడ్డి , పాఠశాల ప్రిన్సిపాల్ రాము, తదితరులు పాల్గొన్నారు.