కలుషిత ఆహారంపై ర్యాపిడ్ యాక్షన్ టీం
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటలను సర్కార్ సీరియస్ గా పరిగణిస్తోంది.
దిశ, మేడ్చల్ బ్యూరో : సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటలను సర్కార్ సీరియస్ గా పరిగణిస్తోంది. తరచూ ఇలాంటి ఉదంతాలు బయట పడుతుండడంతో కలుషిత ఆహారం నివారణ కోసం జిల్లా స్థాయిలో రాపిడ్ యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. శుక్రవారం మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి నాయకత్వంలో వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.రఘునాథ స్వామి, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ జగన్నాథం, డీసీహెచ్ఎస్ జిల్లా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునీత, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, గురుకుల పాఠశాలల జిల్లా కమిషనర్ రజనీకాంత్, ఎస్సీ, ఎస్టీ అభివృద్ది శాఖ అధికారి వినోద్ కుమార్, ఫుడ్ సెప్టీ డీఓ డాక్టర్ మల్లీశ్వరి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసినట్లు విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు.