విద్యార్థుల హాస్టళ్లలో పోలీసుల తనిఖీలు..

2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ముందస్తుగా తనిఖీలు చేపడుతున్నారు.

Update: 2024-12-21 03:38 GMT

దిశ, ఘట్కేసర్ : 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ముందస్తుగా తనిఖీలు చేపడుతున్నారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యార్థుల హాస్టళ్లలో సోదాలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ మల్కాజ్గిరి ఆదేశాల మేరకు రాబోతున్న నూతన సంవత్సర - 2025 వేడుకలలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఇంజనీరింగ్ కాలేజీల సమీపంలోని హాస్టళ్లలో తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో సీఐ రాజువర్మ, ఎస్ఐలు పాల్గొన్నారు.


Similar News