కంటోన్మెంట్ లో ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతులు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల రోడ్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ ప్రాంతాలలో నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ అయ్యాయి.
దిశ, మేడ్చల్ బ్యూరో : హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల రోడ్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ ప్రాంతాలలో నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న డిఫెన్స్ భూముల సేకరణ కోసం ఈవీఐ (ఈక్వల్ వ్యాల్యూ ఇన్ఫోస్ట్రక్చర్) 303.62 కోట్ల రూపాయల డిపాజిట్ పరిశీలన అంశంపై జీహెచ్ఎంసీ, హెచ్ఎం డబ్ల్యూ ఎస్ బీ, హెచ్ఎండీఏ అధికారులకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ దాని కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పారడైస్ జంక్షన్ నుంచి రాజీవ్ రహదారి స్టేట్ హైవే మీదుగా షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్, అదే విధంగా పారడైజ్ జంక్షన్ నుంచి నేషనల్ హైవే 44 డెయిరీ ఫార్మ్ రోడ్డు వరకు ఉన్న డిఫెన్స్ సంబంధిత భూములలో ఎలివేటెడ్ కారిడార్ రోడ్ల నిర్మాణం జరగనుంది.