పేదలకు ఆధునిక వైద్యం అందించాలి
ప్రైవేటు హాస్పిటల్లలో పేదలకు సైతం ఆధునిక వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
దిశ, కూకట్పల్లి : ప్రైవేటు హాస్పిటల్లలో పేదలకు సైతం ఆధునిక వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నంబర్ ఒకటిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిరంజీవి వాస్కులర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ వైద్యులు ప్రాణదాతలని, రోగిని ప్రేమతో ఆదరించాలని కోరారు.
నేడు హైదరాబాద్ నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ప్రపంచ పటంలోనే ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విద్యా, వైజ్ఞానిక, సాంకేతిక, వైద్య రంగాలలో నగరం పురోగతి సాధిస్తుందని అన్నారు. అనంతరం చిరంజీవి హాస్పిటల్ చైర్మన్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ కె. సంజీవరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, నాగిరెడ్డి, మేకల మైఖేల్, సంజీవ్ రావు, వైద్యులు డాక్టర్ శిల్పా పొన్నాడ, డాక్టర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.