MLA Vivekananda : వక్ఫ్ బోర్డు భూములనే సాకుతో రిజిస్ట్రేషన్లు ఆపకండి

కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బుతో భూములను అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండటం సరైనది కాదంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు.

Update: 2024-11-05 13:56 GMT

దిశ, పేట్ బషీరాబాద్ : కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బుతో భూములను అమ్ముకునే వారికి, కొనుక్కునే వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండటం సరైనది కాదంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు భూములంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా భూముల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయారు. కాగా అత్యధికంగా ఒక్క కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 169 సర్వే నెంబర్ల పరిధిలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో స్థానికులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు మొరపెట్టుకున్నారు.

    దీంతో ఆయన మంగళవారం కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ తో కలిసి రిజిస్ట్రేషన్ల సమస్యను ఎదుర్కొంటున్న ఆయా బస్తీబాసులతో పేట్ బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమస్యపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ డీఆర్, డీఐజీలతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పద్మానగర్ ఫేస్ 2 లో భూములు కొనుక్కున్నవారిని, అమ్ముకున్న వారిని దృష్టిలో పెట్టుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పున:ప్రారంభించాలని కోరారు. పద్మానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తి రెడ్డి, గణేష్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు దుర్గారావు, పద్మా నగర్ ఫేస్ -2, గణేష్ నగర్ వాసులు సతీష్ రెడ్డి, సత్యం, ఓబుల్ రెడ్డి, అప్పారావు, రామారావు, సత్యనారాయణ, ప్రసాద్, వెంకట్ రావు, ప్రకాష్, రంగారావు, రాజేష్, వెంకన్న పాల్గొన్నారు. 

Tags:    

Similar News