మంత్రులకు ఎమ్ముల్యే వినతి పత్రం..
తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని శాసనసభలోని తన ఛాంబర్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని సమస్యలను వివరించారు.
దిశ, అల్వాల్ : తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని శాసనసభలోని తన ఛాంబర్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని సమస్యలను వివరించారు. ముఖ్యంగా సర్కిల్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పుడు ఉన్న కార్యాలయం బేగంపేటలోని వల్లభ నగర్లో ఉండడంతో సామాన్యుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నదని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అల్వాల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.
అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను శాసనసభలోని తన కార్యాలయంలో కలిసి నియోజకవర్గం పరిధిలోని మచ్చబొల్లారం, మౌలాలి, వినానయక్ నగర్ గౌతం నగర్ తదితర డివిజన్లలో అధనంగా బస్సు వేసి ప్రజలకు రవాణా సౌకర్యాం మెరుగు పరచాలని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 9 డివిజన్ల పరిధిలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో నూతన బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రిని అభ్యర్థించారు.