ఈనెల 16 నుంచి మేడ్చల్ జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు

మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో సీఎం కప్ - 2024 క్రీడా పోటీలు ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగనున్నాయి.

Update: 2024-12-11 14:20 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో సీఎం కప్ - 2024 క్రీడా పోటీలు ఈనెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి వివిధ క్రీడల అంశాలు, నిర్వహించనున్న వేదికల వివరాలను క్రీడల శాఖ విడుదల చేసింది.

అర్హతలు

క్రీడాకారులు మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వాస్తవ్యులై ఉండాలి. అలాగే వయసు ధృవీకరణ పత్రం, 10వ తరగతి మెమో, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్ కార్డును సమర్పించాలి.

క్రీడలు, తేదీల వివరాలు

ఈ నెల 16న : యోగా, చెస్, జూడో, హ్యాండ్బాల్, సైక్లింగ్, బాక్సింగ్

17వ తేదీన : ఖో-ఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్

18వ తేదీన : కబడ్డీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కిక్‌బాక్సింగ్, నెట్‌బాల్

19వ తేదీన : బాస్కెట్ బాల్ విభాగంలో పోటీలు నిర్వహిస్తారు.

వేదికలు

ఈ పోటీలను తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్, కీసర ఓఆర్ఆర్, లాలగూడ, వీవీ రావు స్పోర్ట్స్ అకాడమీ ఆల్వాల్, ఉప్పల్ బగాయత్ లేఔట్, జెడ్పీ హెచ్ఎస్ ఉప్పల్, పల్లవి స్కూల్ ఆల్వాల్, జింఖాన గ్రౌండ్స్ లలో ఈ పోటీలను నిర్వహించనున్నారు.

ప్రతిభకు గుర్తింపు - బహుమతుల ప్రదానం

ఈ పోటీలలో జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్లు, పాల్గొన్న వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు.

అదనపు వివరాలకు కోసం...

9912770801, 7660919518 నంబర్లకు సంప్రదించవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి : గోపాల్ రావు

క్రీడల పట్ల ఆసక్తి కలిగిన జిల్లా యువతీ ,యువకులు ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని జిల్లా క్రీడల శాఖ అధికారి గోపాల్ రావు కోరారు. 


Similar News